హైదరాబాద్ గ్లోబల్ ఏఐ సిటీలో భాగమవ్వాలి
25-06-2024 04:19 AM
- మారియట్ ఇంటర్నేషనల్‌ను కోరిన ఐటీ మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ గ్లోబల్ ఏఐ సిటీలో భాగం కావాలని అమెరికాకు చెందిన ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ మారియట్ ఇంటర్నేషనల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శ్రీధర్‌బాబు ఇటీవల ఆ దేశ పర్యటనలో మారియట్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ గ్లోబల్ సీటీఓ నవీన్ మంగాతో సమావేశమయ్యారు. నాటి ఫొటోలను సోమవా రం షేర్ చేస్తూ.. హైదరాబాద్ గ్లోబల్ ఏఐ కన్వేన్షన్‌లో చేరాలని శ్రీధర్ బాబు కోరారు. మారియట్ ఇంటర్నేషనల్ ఆఫీసులో టెక్నాలజీ అద్భుతం గా ఉందని, సంస్థ సాంకేతికతలో కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.






