31 July, 2026 | 7:55 AM

నిమిషాల వ్యవధిలోనే కుండపోత వర్షం

23-06-2024 06:14 PM

హైదరాబాద్ : నగరంలో ని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలో జోరుగా వర్షం కురిసింది. దీంతో రహదారులు నదులను తలపించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. నిమిషాల వ్యవధిలోనే భారీ వర్షం మొదలైంది.