కల్తీసారా బాధితులను పరామర్శించిన కమల్ హసన్
చెన్నై : తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి దవాఖాన పాలైన బాధితుల్ని మక్కల్ నీది మయ్యమ్ అధినేత, సినీ నటుడు కమల్ హసన్ ఆదివారం పరామర్శించారు. కల్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసిన చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు. ఈ సందర్భంగా కమల్ హసన్ మాట్లాడుతూ... పరిమితికి మించి తాగొద్దని, అర్థం చేసుకోవాలని చెప్పారు.
తాగుడుకు బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిన ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతునే ఉంది. ఇప్పటికి మృతుల సంఖ్య 56కి పెగిరినట్లు జిల్లా యంత్రాంగం ఇవాళ ప్రకటన విడుదల చేసింది. కరుణాపురం గ్రామానికి చెందిన చిన్నదురై అనే వ్యక్తి కల్తీ సారా సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించి, అతని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.






