calender_icon.png 29 July, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మాసిటీని రద్దు చేయాలి

29-07-2025 02:28:50 AM

  1. మా భూములు మాకు ఇప్పించాలి
  2. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన 
  3. 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

ఎల్బీనగర్, జూలై 28: ఎన్నికల సమయం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మ సిటీని రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు, ఫార్మాసిటీని రద్దుచేసి తమ భూములను తమకు ఇప్పించాలని కోరుతూ రైతు లు ఆం దోళన చేపట్టారు. తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పినా, బలవంతంగా లాక్కున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోదండరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇండ్లను ముట్టడి చేస్తామని ఫార్మాసిటీ రైతులు హెచ్చరించారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటి ఎదుట సోమవారం యాచారం మండల పరిధిలోని నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మీద్ద, మేడిపల్లి నాలుగు గ్రామాలకు చెందిన 200 మంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఫార్మసిటీని రద్దు చేస్తాననే హామీని నెరవేర్చకుండా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల విలువచేసే భూములకు ఎకరానికి రూ.12 లక్షలు వెలకట్టడం, ప్లాట్లు ఇస్తామని, పారితోషికం అని ఊదర కొడుతున్నారని విమర్శించారు. తమ భూములు లాక్కుంటే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కట్నంగా ఇచ్చిన భూములు ఫార్మా సిటీలో పోతున్నాయని, అల్లుళ్లు  భార్యాబిడ్డలను తమ ఇంటికి పంపిస్తున్నారని వాపో యారు.

ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు కానమోని గణేష్, మహిపాల్‌రెడ్డి, ఆధ్వర్యం లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి, 2,500 ఎకరాల పట్టా రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో ఎక్కించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షే మ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

800 మంది ఫార్మిసిటీ రైతులు 32 కేసులు కోర్టులో వేశారని, అందుకుగాను 8 కేసుల్లో భూ సేకరణను హైకోర్టు రద్దు చేసిందని, మిగతా కేసుల్లో స్టే కొనసాగుతోందని చెప్పా రు. ఇప్పుడున్న ప్రభుత్వం మరల భూములు కావాలని కోర్టుకు వెళ్తున్నదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. 

అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే

రైతులతో ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్, ఆర్డీవో, టీజీఐఐసీ అధికా రులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 10 రోజుల్లో రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు ముత్యాల వెంకట్‌రెడ్డి, బందే రాజశేఖర్‌రెడ్డి, వినోద్, కొండల్, అనంతరెడ్డి, నాగరాజు, శ్రీకాంత్ నాయక్, బర్ల మల్లేష్, సంగెం మహేందర్‌తోపాటు నాలుగు గ్రామాల రైతులు పాల్గొన్నారు.