calender_icon.png 15 May, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం

14-05-2025 11:48:56 PM

నిందితులపై హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదని ఫైర్..

తుర్కయంజాల్: హయత్నగర్ సీఐ నాగరాజుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) సీరియస్ అయ్యారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలోని సర్వేనెంబర్ 951, 952 లోని భూమి విషయంలో మారణాయుధాలతో దాడి చేసిన ఘటన గురించి రంగనాథ్ తెలుసుకున్నారు. రాజాజీ లే అవుట్లో ప్లాట్ల యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదని సీఐ నాగరాజుపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందని సీఐని మందలించారు.

కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951,952లో ప్లాట్స్ ఓనర్స్, ఆ భూమి కొనుగోలు చేసిన సంరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి మధ్య కొన్నాళ్లుగా వివాదం  కొనసాగుతోంది. ఇరువర్గాలు కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 1న ప్లాట్ల యజమానులు క్లీన్  చేసుకుంటుండగా బాల్ రెడ్డి వర్గీయులకు ప్లాట్ల యజమానులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ప్లాట్స్ ఓనర్లపై గొడ్డళ్లు, కత్తులతో బాల్ రెడ్డి వర్గీయులు దాడికి దిగారు.

ఈ ఘటనపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్యాయత్నం కాకుండా, సాధారణ గొడవగా ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గొడవపై పూర్తి వివరాలు తెలుసుకున్న రంగనాథ్ కత్తులు, గొడ్డళ్లు ఉపయోగించినా కూడా బాల్ రెడ్డిపై హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాధితులకు హైడ్రా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితుల పట్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.