calender_icon.png 11 August, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

11-08-2025 10:42:04 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమై కొనసాగుతున్నాయి. బనకచర్లపై(Banakacherla) బీఆర్ఎస్ మరోసారి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టును అడ్డుకోవాలని, ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నోటీసుల్లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తున్న గోదావరి నదీ జలాల అంశం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని రాజ్యసభలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న వివాదాస్పద గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టుపై(Godavari-Banakacharla Project) వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ గతంలోనే రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు దక్కాల్సిన నీటిని మళ్లిస్తుందని, రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. ఈ అంశంపై చర్చకు వీలుగా సాధారణ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీ దివకొండ దామోదర్ రావుతో కలిసి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు నోటీసు ఇచ్చారు.