calender_icon.png 15 May, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులుగా మారిన మిల్లర్లు?

15-05-2025 12:00:00 AM

  1. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కు 
  2. అన్నదాతలను నిలువునా దోపిడీకి గురిచేస్తున్న వైనం 
  3. పట్టించుకోని ఉన్నతాధికారులు
  4. నష్టపోతున్న రైతన్నలు 
  5. ప్రతి సీజన్లో ఇదే తంతు 

కామారెడ్డి, మే 14 (విజయక్రాంతి) : రైస్ మిల్లర్‌లే దళారులుగా అవతారం ఎత్తుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహ  కులతో కుమ్మక్కు రైస్‌మిలర్లు కొందరు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ తతంగం బయటపడుతున్న ఉన్నతాధికారు లు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి సీజన్లో ఇదే తంతు కొనసాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రతి సీజన్లో రైతులను  రైస్ మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిలువు దోపిడీకి గురిచేస్తున్న ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం గునుకూల్ విండో పరిధిలో మహమ్మద్ నగర్, సింగీతం, తునికిపల్లితో పాటు తొమ్మిది కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మిగతా గ్రామా ల్లో రైతుల కోసం ఐటిపి ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అంత సాఫీగా సాగుతుందనుకున్న తరుణం లో కొందరు రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వకులతో కుమ్మక్కు దళా రుల అవతారం ఎత్తారు. వెయిట్ లాస్ పేరు తో ఆధారంగా ఒక లారీకి పది నుంచి 16 ధాన్యం బస్తాలను కోత విధిస్తున్నారు. రైస్ మిల్లులో ఉండాల్సిన ధర్మకాంత రైతులకు కనబడదు.

ఎందుకంటే బయట ఉండాల్సింది డిస్ప్లే తొలగించి వారి సిస్టంకు కనెక్ట్ చేయడంతో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ధాన్యం బస్తాలను తరుగు పేరిట రైస్ మిల్లర్లు కొందరు దండుకుంటున్నారు. ఇదేం పద్ధతని రైతులు రైస్ మిల్లర్లను ప్రశ్నిస్తే మీరు ఎక్కడ అమ్మారో అక్కడ అడగండి అంటూ సమాధానం ఇస్తున్నారు.

ఈ విషయంపై సొసైటీ సీఈవో ను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని చేతులెత్తేయడం  గమనార్వం. ఉన్నతాధికారులు ఇలాంటి ఘటన లపై పట్టించుకోకపోవడంతో రైతులను రైస్ మిల్లర్లు  ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ సహాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయం లో రైస్ మిల్లర్లు తమను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు.. 

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  తరుగు పేరుతో రైతులను ధాన్యం కొనుగోలు నిర్వహ కు లతోపాటు కొందరు రైస్ మిల్లర్లు కుమ్మక్కు రైతుల ను నట్టేట ముంచుతున్నారు. అందిన కాడికి తరుగు పేరుతో నిలువు దోపిడీ కి గురి చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి అమ్మడానికి వస్తే దళారులుగా అవతారమెత్తి రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిర్వాహకులతో  కుమ్మక్కు నిలువు దోపిడికి గురి చేస్తున్నారని రైతు లు ఆరోపస్తున్నారు.

కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసిన ఎవరు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులైన స్పం దించి రైతులను నిలువు దోపిడికి గురి చేస్తున్న రైస్ మిల్లర్లు , ధాన్యం కొనుగోలు కేంద్రం నేర్వాకులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడుస్తుందని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.. 

జిల్లాలో ధాన్యం తూకంలో తరుగు  పేరి ట రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిబంధనల విరుద్ధంగా తరుగు తీస్తే చర్యలు తీసుకుం టాం. రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

- -మల్లికార్జున్‌బాబు, జిల్లా 

పౌరసరఫరాల శాఖాధికారి, కామారెడ్డి