11-08-2025 10:59:50 AM
న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision), 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ చోరీ (Vote Chori) ఆరోపణలపై నిరసన వ్యక్తం చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కవాతు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిపక్ష ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ మార్చ్‌లో 25 ప్రతిపక్ష పార్టీల నుండి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొంటారు. అయితే, ఇండియా బ్లాక్(INDIA bloc) నాయకులు ప్రతిపాదిత మార్చ్‌కు ఇప్పటివరకు అనుమతి కోరలేదని ఢిల్లీ పోలీసులు(Delhi Police) తెలిపారు. గురువారం ముందుగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ, ఈసీ మధ్య కుమ్మక్కై ఎన్నికలలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో జరిగిన విశ్లేషణను ఆయన ఉటంకిస్తూ, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నేరం అన్నారు. కాంగ్రెస్, విపక్షాలు ఓట్ల చోరీ వ్యవహారంపై ఉద్యమం ఉద్ధృతం చేస్తున్నాయి.