calender_icon.png 9 May, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పని తీరు బాగుంది

22-08-2024 12:00:00 AM

ఇటీవల ప్రభుత్వ ప్రవేశ పెట్టిన హైడ్రా అద్భుత పనితీరు కనబరుస్తోంది. అక్రమార్కులకు ఇది భయాందోళన కలిగించినా, సామాన్యులకు మేలు చేస్తుంది.  ప్రభుత్వ భూములో,్ల చెరువుల్లో, పార్కుల్లో కబ్జాలకు పాల్పడి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. వాటి వల్ల వానలు వరదలు. భూకం పాలు వంటి విపత్తులు వస్తే తీవ్ర స్థాయిలో అస్తి ,ప్రాణ నష్టం జరుగుతుంది. గత ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇపుడు  కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి  పక్షపాతం లేకుండా హైడ్రాతో దూసుకుపోతుంది. కొందరు దిన్ని వ్యతిరేకించినా సర్కారు అంతే జోరుగా దూకుడుగా ముందుకెళ్లాలి. ప్రభుత్వ ఆస్తులను, పార్కులను నాలాలను కాపాడాలి. మరొక మారు ఇటువంటి అక్రమాలు చేసే వారికి గుణాపాఠం కావాలి. భావి తరాలకు పచ్చని చెట్లు, పార్కులను అందివ్వాలి.

 శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్