calender_icon.png 30 January, 2026 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు పరీక్షలకు అధిక సమయం వెచ్చించినప్పుడే ఉత్తమ ఫలితాలు

30-01-2026 03:49:36 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యార్థులు దీర్ఘకాలం మనతో ఉండే వాటికి కాకుండా అప్పుడప్పుడు వచ్చే పరీక్షలకు అధి సమయం వెచ్చించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమైతాయని ప్రముఖ కెరీర్ కోచ్, ఎన్ఎస్ఎస్ లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ సి. మల్లేష్ అన్నారు. జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ వెంకటాపూర్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ లో ప్రతాప సింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ, 9వ తరగతి చదువుతున్న దాదాపు 150 విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ సెల్ అనురాగ్ యూనివర్సిటీ, స్ఫూర్తి ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన కెరీర్ తరగతులు  నిర్వహించారు.

ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎస్ ఎస్ ఆఫీసర్, ప్రముఖ కెరీర్ కోచ్, ఎడ్యుకేటర్ డాక్టర్ సి.మల్లేష్ విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళిక చేసుకొని, ఎవరికి వారు తను వెనుకబడిన సబ్జెక్ట్ లకు ఎక్కువ సమయం కేటాయించే విధంగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. పరీక్షలు అప్పుడప్పుడు వస్తాయని, మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు మనతోనే దీర్ఘకాలం ఉంటారని, కావున అప్పుడప్పుడు వచ్చే పరీక్షలకు అధిక సమయం వెచ్చించాలని అప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని గుర్తు చేశారు.

విద్యార్థులు తప్పనిసరిగా 7గంటలు నిద్రపోవాలని, జెంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని, నిరంతరాయంగా చదవకుండా ప్రతి 45 నిమిషాలకు విరామం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు త్వరగా నిద్రలేవాలంటే ప్రతికూల ప్రాంతంలో ఉండే విధంగా చూడాలని, ముఖ్యంగా చదవడం రాయడం చేసినప్పుడే చదివినది గుర్తుంటుందని అన్నారు. విద్యార్థులు ఎవరికి వారు చేసుకుంటూ చదవడానికి చేసుకుంటున్న ప్రణాళికలు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, ఉపాద్యాయులు సాగర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీవిద్య, విద్యార్థులు పాల్గొన్నారు.