30-01-2026 03:52:02 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని ఖమాన్ గ్రామంలో శుక్రవారం పారిశుద్ధ పనులు ముమ్మరంగా చేపట్టారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన వీధులు, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కార్మికులు తొలగించారు. అలాగే తాగునీటి ట్యాంకుల పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, వ్యాధులు దరిచేరకుండా ప్రజలు సహకరించాలని గ్రామ సర్పంచ్ సునీత కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.