calender_icon.png 30 January, 2026 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటిక్యాల గోదావరి తీరాన పోటెత్తిన భక్తజనం

30-01-2026 03:40:58 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల శివారులోని గోదావరి తీరాన వెలసిన సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున గద్దెల వద్దకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు చిన్నారుల తులాభారం బెల్లం (ఎత్తు బంగారం) జోకి సమ్మక్క సారలమ్మలకు సమర్పించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి భక్తులకు సహకరిస్తున్నారు. లక్షెట్టిపేట మండల భక్తులే కాకుండా దండేపల్లి, హాజీపూర్, మంచిర్యాల నుంచి, అటు జగిత్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సమ్మక్క - సారక్క జాతర ఈ ప్రాంతంలో సందడిగా కొనసాగుతోంది.