calender_icon.png 30 January, 2026 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

30-01-2026 03:58:48 PM

సీఐ బాలాజీ వరప్రసాద్

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రాల పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి, నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు.ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.