calender_icon.png 30 January, 2026 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

30-01-2026 03:56:41 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్ర గ్రామ సంగం నూతన కమిటీ ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికలు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సారంగలవార్ గంగారం ఆధ్వర్యంలో ఎన్నికల అధికారిగా బి.దయానంద్ సార్ నిర్వహణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అధ్యక్షునిగా పాకల సాయిలు, ప్రధాన కార్యదర్శిగా చౌలవార్ అనిల్, సంగం యూత్ అధ్యక్షునిగా బొగ్గుల సంజు, గ్రామ సంఘం గౌరవ అధ్యక్షులుగా ప్రస్తుత గ్రామ ఉపసర్పంచ్ వట్నాల రమేష్ ను ఎన్నుకున్నారు.

గ్రామ సంగం ఉపాధ్యక్షులుగా కంచిన్ యాదవ్రావు, గడ్డివార్ తుకారాం, జాయింట్ సెక్రెటరీగా రిటైర్డ్ కండక్టర్ గంగారం, వడ్డేవారు వెంకన్న, కోశాధికారిగా రౌతు వార్ నాగనాథ్ ఈ నూతన కమిటీలో పలువురిని సలహాదారులుగా నియమించారు. గ్రామ కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరగడానికి సహకరించుకున్న ప్రతి ఒక్కరికి  మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు సారంగలవార్ గంగారాం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన సాయిలు అనిల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపుల సమస్యలపై పోరాడుతామని సంఘం అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు.