calender_icon.png 30 January, 2026 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ ఆటలా పోటీలు ప్రారంభం

30-01-2026 03:43:55 PM

లింగాపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జెడ్పి హై స్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన  సీఎం కప్ ఆటల పోటీలను శుక్రవారం జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడమెత విశ్వనాత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ని అన్ని గ్రామా పంచాయతీ క్రీడాకారులకు మండల స్థాయి క్రీడాలు సమరస్యంగా నిర్వహించాలన్నారు.

మండల స్థాయి క్రీడాలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమం లో ఎండివో  రామచందర్ రావు ఎంఈఓ శ్రీనివాస్,  సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, నాయకులు  ప్రెసిడెంట్ లోకేందర్, అత్రం అనిల్. మాజీ ఎంపీటీసీ రాథోడ్ బలిరాం రమేష్, సునీల్ ,ఎంపీఓ ఆజాద్ పాషా, పంచాయత్ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.