27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

యంనంపేట్ వాగు కబ్జాను పరిశీలించిన హైడ్రా అధికారులు

04-06-2026 01:28 AM

ఘట్ కేసర్, జూన్ 3 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ బొంతకుంట వాగుపై ని ర్మించిన చెక్ డ్యామ్ ఎగువ భాగంలో ఓబ డా రియల్ ఎస్టేట్ సంస్థ మట్టితో వాగును కబ్జా చేయడం పై బుధవారం హైడ్రా ఏసిపి ఉమామహేశ్వరరావు ఇంతర శాఖల అధికారులతో కలసి వాగును పరిశీలించారు. యంనంపేట్ సర్వేనంబర్ 153,154లో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ బహుల అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారు.

దాని సమీపంలోని ఉన్న బొంతకుంట వాగును రియల్ ఎస్టేట్ సంస్థ మంటితో పూడ్చివేయడంతో స్థానికులు హైడ్రా అధికారులకు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా ఏసిపి ఉమా మహేశ్వరరావు, సిఐ రాజశేఖర్, ఇరిగేషన్ ఏఈ, సర్వేయార్, రెవెన్యూ సిబ్బందితో వాగును పరిశీలించారు. ఎగువ భాగంలో సర్వే పాయింట్లు నిర్వహించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. మరొక్కసారి శుక్రవారం సర్వే నిర్వహిస్తామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.