22 May, 2026 | 12:57 AM

17 రోజుల్లో తీశారంటే నమ్మలేకపోయా

22-05-2026 12:12 AM

నాగబాబు కొణిదెల, గెటప్ శ్రీను, రవి తేజ నన్నిమాల వంటి తారాగణం“మేము కాప్’లం”తో అలరించేందుకు సిద్ధమైంది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బీవీఎస్ రవి నిర్మించిన ఈ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. జీ5 తెలుగులో మే 22 నుంచి స్ట్రీమింగ్ కానున్న క్రమంలో గురువారం ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమన్, బండ్ల గణేశ్, అజయ్ భూపతి, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. “కేవలం 17 రోజుల్లోనే సిరీస్ తీశారంటే నమ్మలేకపోయా. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. “ఇదొక రిఫ్రెషింగ్ కంటెంట్‌లా ఉంది. ప్రతి  ఒక్కరికీ ఈ సిరీస్ నచ్చుతుంది” అని చెప్పారు. “మే 22న స్ట్రీమింగ్ కానున్న మా సిరీస్‌ను అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి అన్నారు.

నిర్మాత బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “కోడి పోవడం, దాన్ని పట్టుకునేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రంగంలోకి దిగటం వంటి అంశాలతో మా సిరీస్ ఆనందంగా, ఆహ్లాదంగా, సరదాగా ఉంటుంది” అని తెలిపారు. నిర్మాత కౌముది, జీ5 బిజినెస్ హెడ్ అనురాధ, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కొమండురి, నటీనటులు, సాంకేతిక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.