calender_icon.png 18 December, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్‌లో ఛాన్స్!

17-12-2025 01:21:05 AM

కొంతమంది ఏళ్ల తరబడి సినిమాలు చేస్తున్నా అదృష్టం వరించదు.  మరికొందరు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోతారు. అలా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇటీవల కన్నడ స్టార్ రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్ 2’లో తన నటనతో విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్  నీల్ కాంబో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. ‘హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమే. బాలీవుడ్‌లో కూడా సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. దేవుడి ద యతో త్వరలోనే ఆ పనిని ప్రారంభిస్తానని అనుకుంటున్నా’ అంటూ అసలు విషయం చెప్పింది. మరి రుక్మిణికి  బాలీవుడ్‌లోనూ అదృష్టం వరిస్తే.. ఈ అమ్మడి రేంజ్ మరో స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు.