నీలా తొక్కుకుంటూ రాలే
- కిందిస్థాయి నుంచి ఎదిగిన
- రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి శని
- అది తొలగిపోవాలి
- అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న సర్కారు
- సీఎంగా రేవంత్.. కేసీఆర్ పుణ్యమే
- కేసీఆర్ బహిరంగసభ ఉద్యమాన్ని తలపించింది
- రెండుసార్లు సీఎంగా తెలంగాణను మెదటి స్థానంలో నిలిపారు
- బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): అంద రినీ తొక్కుకుంటూ ఇక్కడిదాకా వచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, కానీ తాను అతనిలా కాకుండా కిందిస్థాయి నుంచి ఎదిగానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌కు తొక్కడమే తెలుసని, ఆయన ఎంత మందిని చైర్మన్లను చేశా రో చెప్పాలని, తాను ఎంతో మందిని చైర్మన్లను చేశానని తెలిపారు. రాష్ట్రానికి పట్టిన శని రేవం త్‌రెడ్డి అని.. అది తొలగిపోవాలని అన్నారు.
జగిత్యాలలో కేసీఆర్ బహిరంగసభ తెలంగాణ ఉద్య మాన్ని తలపించిందని, రెండుసార్లు ముఖ్యమంత్రిగా దేశంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారని వెల్లడించారు. ఇప్పుడు ముఖ్య మంత్రిగా రేవంత్‌రెడ్డి ఉన్నాడంటే అది కేసీఆర్ పుణ్యమేనని, రేవంత్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థ లను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మం గళవారం జగిత్యాలలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యా లయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే.. రేవంత్‌రెడ్డి మూ డు పంటలకు రైతుభరోసా ఎగ్గొట్టారని విమ ర్శించారు. పంటల బీమా పథకం ఊసే లేదని, భూమి లేని వారికి ప్రోత్సాహకం ఇస్తామని మరిచారని, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి అమలు చేయ డంలేదని, పెండ్లి నాటికి ఇవ్వాల్సింది ప్రసూతి నాటికి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కిట్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ పేరుతో అమలు చెయ్యాలని హితవుపలికారు.
రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి మళ్లాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి.. అంటు న్నామే తప్ప తాము రేవంత్ కీడు కోరడంలేదని, ప్రజలు పాలన మార్పు కోరుతున్నారని వెల్లడిం చారు. వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్‌ను ఉరి తీస్తావా అని ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ కుం గిపోయి 30 నెలలు అయ్యిందని, రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిద్ర లేచినట్టు నటిస్తున్నారని మండి పడ్డారు.
మరమ్మతులు చేస్తే కేవలం రూ.400 కోట్లు అవుతాయని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ మర్మతులు చేపట్ట లేదని, కేసీఆర్‌ను దోషిని చేయడానికే జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తుమ్మడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సుమారు 1,000 టీఎంసీల నీరు లభిస్తుందని కాళేశ్వరం ప్రాజె క్టును నిర్మించారని, వాతావరణం అనుకూలించ కపోతే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారితే దాని కి రేవంత్‌రెడ్డి బాధ్యుడు కాదా అని నిలదీశారు. ఆనాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని రేవంత్ ఓటుకు నోటు తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.
నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం
తన ప్రజా జీవితం తెరిచిన పుస్తకమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని, నాడు 13 మంది కాంగ్రెస్‌లో చేరితే తాను ఒక్కడినే పార్టీ మార లేదని గుర్తుచేశారు. నాదెండ్ల భాస్కర్‌రా వును మంత్రి పదవి నుంచి తొలగించడం సరికా దని ఇందిరాగాంధీ సైతం అండగా నిలిచారని తెలిపా రు. తాను కూడా మంత్రి పదవికి రాజీనా మా చేశానని తెలిపారు.
తనను ఎవరూ తొలగి ంచలేదని, రేవంత్ ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను ఒక్కడినే గెలిచానని, 2019లో శాసన మండ లిలో ఒంట రిగా పోరాటం చేశానని, పార్టీ మా త్రం మార లేదని వివరించారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని వెల్లడించారు. తెలంగా ణ రాష్ట్రం లో అత్యధికంగా ద్వితీయ శ్రేణి నాయ కత్వం ఎదిగింది జగిత్యాలలోనేనని పేర్కొన్నారు.
మేడిగడ్డ మరమ్మతులపై చిత్తశుద్ధి ఉందా?
మేడిగడ్డను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని, బరాజ్ మరమ్మతుపై చిత్తశుద్ధి ఉం దా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొ న్నారు. చెరువులు అక్రమిస్తే తొలగిం చాలని, కానీ పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. మూ సీ ప్రక్షాళన చేయాలని, సుందరీకరణ కాదని, ప్రజా పాలన నెపంతో ప్రజలను వంచిచే ప్రయ త్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభు త్వం మంచి పాలన అందిస్తే.. ఆర్టీసీ కార్మి కులు సమ్మె ఎందుకు చేయబోతున్నారో చెప్పా లని డిమాండ్‌చేశారు.
సింగరేణి కార్మికులు, కాంట్రా క్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోమ్ గాడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రజలు అభద్రతలో ఉన్నా రని పేర్కొన్నారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ ఏమైందని, రాష్ట్రంలో ఏం జరుగు తున్నదో రాహుల్‌గాంధీకి కనపడుతలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జీవన్‌రెడ్డికి 14 సార్లు టికెట్ ఇచ్చిందంటున్నారని, సమర్థత లేకుండా నే ఇచ్చారా అని ప్రశ్నించారు. 1996 ఉప ఎన్ని కలోనే 73 శాతం ఓట్లు సాధించానని, ఎ మ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కాలుకు బల పం కట్టుకొని తిరిగి ఎందుకు గెలిపించ లేకపో యావని నిలదీశారు.
కేసీఆర్ మాత్రమే రాష్ట్రా నికి శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్‌లో ఎప్పు డూ ఏమవుతున్నదో తెలియదని జీవన్‌రెడ్డి పేర్కొ న్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వీర్యం అవు తున్నదన్నారు. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ మాటలు వినేందుకు టీవీల ముందు కూర్చున్నదని వెల్లడించారు. కేసీఆర్ సభను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా, సభ విజయవంతమైందన్నారు. వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేశాడని, తాను ఏనా డు మంత్రి పదవి కోసం అధిష్ఠానం వద్దకు వెళ్లలేదని పేర్కొన్నారు.
ఆత్మగౌరవం.. ఆత్మ అభిమానం కోసం బయటకు వచ్చానని స్పష్టం చేశారు. చంద్రబాబు స్కెచ్‌తోనే రేవంత్‌రెడ్డి కాం గ్రెస్‌లో చేరాడని, పదవుల వెంట వెంపర్లాడేది తాను కాదని, రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎంత మందిని చైర్మన్లను చేశారని ప్రశ్నించారు. రేవంత్ కాంగ్రెస్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని విమర్శించారు.
సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మార్కఫెడ్ లోక బాపురెడ్డి, మాజీ జడ్పి వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






