22 April, 2026 | 3:06 AM

జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు

22-04-2026 01:35 AM

ఖమ్మం, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ముఖ్య నాయకులు, శ్రేణుల సమక్షంలో సత్యనారాయణ గౌడ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రేణులు ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్ ను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా ఐ యన్ టి యు సి అద్యక్షులు కొత్తా సీతారాములు, జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం,

జిల్లా ఎస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కాపా సుధాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్, రాష్ట్ర ఎస్ సి సెల్ కన్వీనర్ దర్జీ చెన్నారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా జనార్ధన్,ముళ్ళపాటి సీతారాములు , రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు భానోత్ బాలాజీ నాయక్,మరియు ముఖ్య నాయకులు శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచినారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా మనం అందరం కలిసి కట్టుగా క్రమశిక్షణతో  ఉండి పార్టీ అభివృద్ధికొరకు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కె కె సీ అధ్యక్షులు విప్లవ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు భానోత్ రామ్మూర్తి నాయక్, చింతమల్ల రవి, ఉన్నం రాజశేఖర్,మూడుముంతల గంగరాజు యాదవ్, హఫీజుద్దీన్, మస్తాన్, రాజశేఖర్,గుమ్మా రోశయ్య ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల అంజనీ కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా విభాగం బెల్లంకొండ శరత్, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బండి మాధవరావు, జిల్లా ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు బమ్మిడి  శ్రీనివాస్ యాదవ్, గజ్జి సూర్యనారాయణ, వేల్పుల మురలి, శేఖర్, మెరుగు రత్నరాజు, రత్నాకర్ నాయకులు పాల్గొన్నారు.