calender_icon.png 20 December, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి బ్యాడ్ గాళ్స్

19-12-2025 12:00:00 AM

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయి న్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్‌లైన్. ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలినీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా గురువారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ “కథ చాలా బాగుంది. క్లుమైక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. రేణు దేశాయ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారంటే ఈ సినిమా ఎంత బాగుంటుందో తెలుస్తుంది” అని తెలిపారు. చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ “మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్‌టైనర్ చిత్రం. జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటిదే మా ‘బ్యాడ్ గాళ్స్‌” అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్; లిరిక్స్: చంద్రబోస్; సినిమాటోగ్రఫీ: ఆర్లి గణేశ్; ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి.