calender_icon.png 11 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి నారాయణ ఇదేం గోస!

11-11-2025 12:21:08 AM

  1. చెంపపై కొట్టడంతో చెవులోంచి  రక్తస్రావం 
  2. బస్సు అడుగు భాగాన్ని పట్టుకొని బయటికి వచ్చిన విద్యార్థి 
  3. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై ఈ పంతాలేమిటి?
  4. శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు 

జడ్చర్ల, నవంబర్ 10 : ప్రైవేట్ విద్యాసంస్థలు అంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు ఇక మా బిడ్డకు ఏమి పర్వాలేదు మేము ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపిస్తున్నాం.. అంటూ కనిపించిన ప్రతి వారికి చెప్పుకుంటూ బంధువులందరికీ తెలియజేస్తూ గొప్పలు చెప్పడం ప్రారంభిస్తారు. ఇది అందరూ తల్లిదండ్రులు చేసే పనే. మా బిడ్డ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది ఆ పాఠశాల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మా బిడ్డను తీర్చిదిద్దుతుంది అంటూ భరోసాతో తమ తమ బిడ్డలను పంపిస్తారు.

ఇది కొన్ని పాఠశాలల్లో మాత్రం ఆ భరోసా ఆమడ దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో వెలసిన స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల ఈ ప్రాంతంలో ఈ పాఠశాల పేరు తెలియని వారు ఉండరు. ఇక్కడ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారా మరి ఏమైనా భయబ్రాంతుల గురి చేస్తున్నారా తెలియని పరిస్థితులను ఎలాకుంటున్నాయి.

వరుసగా తప్పులు జరుగుతున్న అవి కప్పిపుచ్చుకుంటూ మా పాఠశాల ఇంటర్నేషనల్ మా పరిధి అంతర్జాతీయ స్థాయి అంటూ చెప్పుకుంటున్న ఈ పాఠశాల నిర్వాహకుల అలసత్వం వల్ల విద్యార్థులకు పలు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. గతంలోనూ పలు విమర్శలకు ఈ పాఠశాల నిలయంగా మారింది. వాటిని పూర్తిస్థాయిలో రూపుమాపుతూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న మాట.

బస్సు అడుగు భాగంలో ప్రయాణించిన విద్యార్థి..!

 గత కొన్ని రోజుల క్రితం స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అక్కడ ఎలాంటి ఇబ్బందులు గురి అయ్యాడు తెలియదు కానీ పాఠశాల నుంచి బయటికి వెళ్లే బస్సు క్రింది భాగంలో వేలాడి ఎవరికి కనిపించకుండా బయటికి వచ్చిన సంఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. కొంతమంది చూసి విద్యార్థి బూటు కాలు కనిపించడంతో బస్సును నిలిపి ఆ విద్యార్థిని క్షేమంగా బయటికి తీసిన సందర్భం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిద్ధార్థ అనే విద్యార్థిని చెంపపై ఒక ఉపాధ్యాయుడు కొట్టడంతో అతని చెవిలో నుంచి రక్తస్రావం అయి ఆసుపత్రి పాలైన సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రులు తో పాటు కుటుంబ సభ్యులు పాఠశాలలో సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ఉపాధ్యాయుని ఓ గదిలో ఉంచి విద్యార్థి తల్లిదండ్రులకు కనిపించకుండా కాపాడిన సందర్భం చోటుచేసుకుంది.

పోలీసుల రంగ ప్రవేశంతో ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి క్షేమంగా ప్రత్యేక వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు లో లోపల మదిన పడుతున్నారు సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి.

నియంత్రణ ఎలా... ఆపేది ఎవరు..?

ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల అంటూ స్వామినారాయణ గురుకుల పాఠశాల లో వరుసగా జరుగుతున్న వివిధ సందర్భాలను ఆపేదెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సామాన్యులు ఆ పాఠశాల వైపే చూడని పరిస్థితిలో  ఉంది. పర్యవేక్షణ అంటే అటువైపే ఉన్నత అధికారులు సైతం ఉంది.

ఇలాంటి ప్రమాదాలు జరిగి విద్యార్థులకు ఏదైనా జరగడానికి జరిగితే బాధ్యులు ఎవరైనా తిరిగి ఆ జరిగిన సందర్భాన్ని తిరిగి తెచ్చుకోలేము కదా అని పలువురు ప్రత్యేకంగా చర్చించుకుంటున్న సందర్భం. ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా అధికార యంత్రం సైతం మరో అడుగు ముందుకేసి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.