23 April, 2026 | 9:50 PM

క్షమాపణలు చెప్పాలి

29-11-2024 02:18 AM

కేటీఆర్‌కు ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): సిరిసిల్ల కలెక్టర్‌పై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల ను ఐఏఎస్ అధికారుల సంఘం (టీజీఐఏఎస్‌ఓఐ) ఖండించింది. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే సింది. సివిల్ సర్వీస్‌లో కీలక బాధ్యతలో ఉన్న అధికారిని కించపరిచేలా వ్యాఖ్య లు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిం ది.

అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలను సిరిసిల్ల ఎమ్మెల్యే ఉపసంహరించు కో వాలని, అనాలోచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కేటీఆర్ వ్యాఖ్యలు నిబద్ధతతో పని చేసే అధికారుల నైతికతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని  ఆవేదన వ్యక్తం చేసింది.