3 May, 2026 | 12:54 AM

జనాగ్రహ సభ కాదు.. బీసీల దగాగ్రహ సభ

02-05-2026 11:22 PM
  1. కులగణన చేస్తామన్నాకే ప్రధాని తెలంగాణకు రావాలి
  2. లేదంటే 10న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  3. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతల వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): బిహార్ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా జ రిగే జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కలు చేపడతామని ఢిల్లీలో ప్రకటించిన ప్రధాని బీహార్ ఎన్నికలు ముగియగానే బీసీలకు మొండి చెయ్యి చూపించా రని, బీసీ కులగలను చేస్తామని ప్రకటించిన తర్వాతే తెలం గాణలో ప్రధాని అడుగు పెట్టాలని లేదంటే ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నల్లజెండాలతో నిరసన కార్యక్రమా లు చేపడతామని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు వెల్లడించారు.

శనివారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జాతి జనగణలో బీసీ కులదరణ చేపట్టాలని ప్రధాన డిమాండ్‌తో బీసీ సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోని 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను బిజెపి గుర్తించడం లేద ని, గత 11 సంవత్సరాల బిజెపి పాలనలో కేంద్రం లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ గాని, బీసీ రిజర్వేషన్లు పెంపు, బీసీ కులగనన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట, పార్లమెంటులో బీసీ బిల్లు తదితర డిమాండ్లు నెరవేర్చకుండా తీవ్రని అన్యా యం చేస్తుందని ఆయన బిజెపిపై మండిపడ్డారు.

బీసీ కులగలను చేపట్టకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ నెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కి నిరసన తెలపాలని నిర్ణయించామని చెప్పారు. బీసీలను నమ్మించి దగా చేస్తున్న బిజెపి వైఖరి నిరసిస్తూ ఈనెల 9వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని, జనగణనలో కుల గణన చేర్చే వరకు వచ్చి మంచినీళ్లు కూడా మొట్టకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని, బీసీల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు.

ప్రధాని పర్యటనను అడ్డుకొని తీరాల్సిందేనని బీఆర్‌ఎస్ నేతలు మధుసూదనా చారి, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం, బీసీలు ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో జనాగ్రహ సభలో పేరుతో నాటకం ఆడుతున్నా రని విమర్శించారు. సకల జనుల స్ఫూర్తితో కేంద్రంపై బీసీలు తిరగబడాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ అని సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భీ మణి మంజరి, బీసీ జేఏసీ కో చైర్మన్ వీటి మల్లయ్య, ఉప్పరి శేఖర్ సగర సంచార జాతుల సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, కౌలే జగన్నా థం, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లల నరసింహ, తారకేశ్వరి, జస్వంత్ కుమా ర్, లక్ష్మణ్ యాదవ్, గూడూరు భాస్కర్, ఆశయ్య, గుంటి మహేష్, తదితరులు పాల్గొన్నారు.