calender_icon.png 2 July, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమిస్తున్నా.. మ్యూజికల్ లవ్‌స్టోరీ

02-07-2025 12:00:00 AM

సాత్విక్‌వర్మ, ప్రీతి నేహా హీరోహీరోయిన్లుగా దర్శకుడు భాను తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు అశోక్ జీ, అనుదీప్ కేవీ, భాను భోగవరుపు, సంగీత దర్శకుడు భీమ్స్, గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, కాసర్ల శ్యామ్ తదితరులు అతిథులగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ.. ‘ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సాత్విక్‌వర్మ ఈ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నారు. తెలుగమ్మాయి ప్రీతి నేహా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సాలూ రి రాజేశ్వరరావు కుటుంబం నుంచి సిద్ధార్థ్ సాలూరి సంగీ తం అందిస్తున్నారు.

ఇదొక మ్యూజికల్ లవ్‌స్టొరీ కాబోతోంది” అన్నారు. నిర్మాత కనకదుర్గారావు మాట్లాడుతూ.. “అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఉంటుంది” అన్నారు. కార్యక్రమంలో హీరో సాత్విక్‌వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.