02-07-2025 02:37:13 PM
దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం సైకిల్స్ ఏర్పాటు
ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ లో పలు అభివృద్ధి పనుల సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఎలిగేడు, (విజయక్రాంతి): జిల్లాలో విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్(Collector Koya Sriharsha) ఎలిగేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుల్తాన్ పూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుల్తాన్ పూర్ గ్రామం మాజీ సర్పంచ్ కీ.శే .తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం వారి 6 కుమారులు పాఠశాలకు అందించిన దాదాపు రూ. 5 లక్షల విలువ గల ఎలెక్ట్రిక్ ఆటో ను, 19977-78 సంవత్సర 7వ తరగతి విద్యార్థులు అందించిన రూ. 2 లక్షల 16 వేల విలువ గల డైనింగ్ టేబుల్ సెట్ లను ప్రారంభించారు.
సుల్తాన్ పూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా 9 లక్షల తో శిధిలావస్థలో ఉన్న డైనింగ్ హాల్ రిన్నోవేషన్ పనులు, రూ. 5 లక్షలతో చేపట్టిన అంతర్గత రోడ్డు, గేటు ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన షూస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిల్స్ అందించేందుకు ప్రతిపాదనలు అందించాలని, పాఠశాలకు దాతలు అందించిన కిచెన్ షెడ్డు కు అవసరమైన 9 డైనింగ్ టేబుల్స్, 18 బెంచీలను కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎలిగేడు తహసీల్దార్ యాకన్న, ఎంపిడిఓ భాస్కర్ రావు, మండల విద్యాశాఖ అధికారి పాఠశాల హెడ్మాస్టర్ నరేంద్ర చారి, సంతోష్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.