calender_icon.png 3 July, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

02-07-2025 01:51:20 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.గత పదేండ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.