calender_icon.png 2 July, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే డిజైన్ చేసిన సినిమా తమ్ముడు

02-07-2025 12:00:00 AM

నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు నితిన్ మాట్లాడుతూ.. “నా గత సినిమా లు నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్‌తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తు న్నా.

నా కో స్టార్స్ 80 రోజులు ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. డే, నైట్ షూట్స్‌లో గాయాలైనా ఓర్చుకుని నటించారు” అన్నా రు. డైరెక్టర్ శ్రీరామ్‌వేణు మాట్లాడుతూ.. “ఈ సినిమాను ఇలా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం డిజైన్ చేశానని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్‌గా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా.

హీరో నితిన్ అన్ కండీషనల్‌గా సపోర్ట్ చేశారు. మెయిన్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఒక విద్య నేర్చుకున్నారు” అని చెప్పారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “ఈ చిత్రం సాధించబోయే సక్సెస్ క్రెడిట్ శ్రీరామ్ వేణుదే. ఐదుగురు ఉమెన్స్ స్ట్రాంగ్ రోల్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. నితిన్‌తోపాటు ఈ ఐదుగురినీ హీరోలుగా అనౌన్స్ చేయొచ్చు.

రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ చేశాం.. సూపర్ హిట్ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే రామ్‌చరణ్‌తో ఓ సూపర్ హిట్ మూవీ ప్రకటిస్తాం” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్, నటీనటులు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ తదితర చిత్రబృందం అంతా పాల్గొన్నారు.