02-07-2025 12:00:00 AM
రానా దగ్గుబాటి ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ టైటిల్‌తో తన సొంత బ్యానర్ స్పిరిట్ మీడియా రూపొందుతున్న ఈ సినిమాతో ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నారు. పల్లెటూరి సున్నితమైన హాస్యంతో కూడిన లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్ ఇది.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి కల్ట్ ఫేవరెట్ చిత్రాలను నిర్మించిన ప్రవీణ ఇప్పుడు డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇది ఒక నాస్టాల్జిక్, హ్యుమరస్, ఆలోచింపజేసే కథ. ఈ చిత్రం ఒక సంఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఒక గ్రామ యువకుడి నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.