02-07-2025 01:54:07 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): మనుషుల ప్రాణాలే కాదు నోరులేని జీవులకు కూడా ప్రాణాలు కాపాడుతున్నారు..నల్లగొండ రక్షకబటులు జిల్లా కేంద్రంలో బుధవారం ప్రమాదవశాత్తు 10 అడుగుల బావిలో పడిన ఆవును సురక్షితంగా నల్లగొండ వన్ టౌన్ పోలీసులు రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు శ్రమించి ఆవును వన్ టౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. ఆవు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు గంటలపాటు శ్రమించి ఆవును కాపాడిన పోలీస్ సిబ్బంది, అగ్నిమాప సిబ్బందికి స్థానికులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.