calender_icon.png 3 July, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2వ రోజు మహిళ రైతుల దీక్ష

02-07-2025 02:41:27 PM

మహబూబాబాద్,(విజయ క్రాంతి): ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా తమ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం(Kesamudram mandal) నారాయణపురం గ్రామ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో రెండవ రోజుకు చేరాయి. బుధవారం రిలే దీక్షలో మహిళా రైతులు రాధమ్మ, వసంత శ్రీలత, అనిత, ఎల్.పద్మ, ఎస్.పద్మ, రజిత, నిర్మల రాణి సరోజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ రవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నిర్వహించిన ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా సాగులో ఉన్న రైతులకు భూభారత్ ద్వారా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసేంతవరకు రిలే దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.