02-07-2025 02:50:14 PM
జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): ఆయిల్ పామ్ సాగులో నాగర్ కర్నూల్ జిల్లా రైతులు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badavath Santosh) పేర్కొన్నారు. బుధవారం ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో రైతు శ్రీకాంత్ పొలంలో 10 ఎకరాల మీద 500 మొక్కల ఆయిల్ పామ్ నాటేందుకు కలెక్టర్ ట్రాక్టర్‌లో ప్రయాణించి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ, ఆయిల్ పామ్ పంట నాలుగో సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుందనీ, ఇది రైతులకు స్థిర ఆదాయాన్ని కలిగిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 7,000 ఎకరాల్లో సాగు జరుగుతోందని, మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు..