25 April, 2026 | 2:11 AM

నామీద పడ్డ మచ్చను తుడిచేయాలి!

25-04-2026 12:41 AM

“పంటో.. గడ్డో.., పాపమో.. పుణ్యమో.., తను నాటింది తనే నరుక్కోవాలి.. నేను నా టిన విత్తనం ఇప్పు డు కోతకొచ్చింది.. అంత కంటే ముం దు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి.. నన్ను న మ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి.. నా పేరు కర సామి” అని ఓ యువకుడు తన బాధను వ్యక్తం చే స్తున్నాడు. ఇంతకీ కరసామి మీద పడ్డ మచ్చ ఏంటి? అతను తనకు ఎదురైన సమస్యను ఎలా దాటి తనపై పడ్డ మచ్చను తుడుచుకున్నాడు.. అనే ది తెలుసుకోవాలంటే స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

ఏప్రిల్ 30న విడుదలవుతోందీ చిత్రం. డాక్టర్ ఇషారి కే గణేశ్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్‌పై పీహెచ్ సతీశ్‌కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా మమితా బైజు నటించింది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. టైటిల్ పాత్రలో నటించిన ధనుశ్.. పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: థేనీ ఈశ్వర్; ఎడిటర్: శ్రీజిత్ సారంగ్.