ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
28-08-2026 04:36 PM
రాఖీలు కట్టిన శిశుమందిర్ విద్యార్థులు
బోథ్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్క చెల్లెలు తమ తోబుట్టువులకు రాఖీలు పెట్టి పండుగ వేడుకలను జరుపుకోవడం జరిగింది. మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనందరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ విద్యార్థులు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. మండల కేంద్రంలోని ప్రాంతాలలో విద్యార్థులు తిరిగి రాఖీలు కట్టడం జరిగింది.






