28 August, 2026 | 5:47 PM

అన్న విగ్రహానికి రాఖీ కట్టిన చెల్లెల్లు

28-08-2026 04:40 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సోదరుడి శిలా విగ్రహానికి రాఖీ పండుగ సందర్భంగా చెల్లెలు రాఖీ కట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం గ్రామ ఎంపీటీసీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ అకాల మృత్యువాత పడ్డారు. అనంతరం అతని కుటుంబ సభ్యులు ఏడాది తర్వాత గ్రామంలో లక్ష్మణ్ నాయక్ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా మరో సోదరుడు రవీందర్ తో పాటు దివంగతుడైన లక్ష్మణ్ నాయక్ శిలా విగ్రహానికి చెల్లెళ్లు రాధ, లింగమ్మ రాఖీ కడుతూ తమ సోదర భావాన్ని కొనసాగిస్తున్నారు. లక్ష్మణ్ నాయక్ శిలా విగ్రహం వద్ద ప్రతి ఏడూ రాఖీ పండుగ నిర్వహించడం అన్నాచెల్లెళ్ల ఆప్యాయత అనురాగానికి నిదర్శనంగా నిలుస్తోంది.