బండి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు
28-08-2026 04:49 PM
ముకరంపుర,(విజయక్రాంతి): రక్షా బంధన్ సందర్బంగా కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంట్లో రక్షాబంధన్ వేడుక ఘనంగా జరిగింది. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి శైలజ చే తన సోదరులతో పాటుగా రాఖీ కట్టించు కున్నారు. ఈ ఈ సందర్భంగా రాఖీ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే బంధానికి మాత్రమే ప్రతీక కాదని ఒకరినొకరు గౌరవించుకోవడం అవసరమైనప్పుడు తోడుగా ఉండడం దేశం పట్ల బాధ్యత కలిగి ఉండడం వంటి ఉన్నత విలువలకు ప్రతీకయే ఈ రాఖీ పౌర్ణమి సందేశం ఇచ్చారు






