calender_icon.png 25 May, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్ కావాలి

25-05-2025 12:46:24 AM

-రీజినల్ రింగ్ రైల్ ఇవ్వండి 

-హైదరాబాద్- బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయండి

-రక్షణ రంగ ప్రాజెక్టులు,సెమీ కండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహించండి 

 -ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ట్రానికి ఇతోధికంగా సాయం అందించి రాష్ట్రాభివృద్ధికి సహకరించా లని ప్రధాని నరేంద్రమోదీని సీఎం రేవంత్‌రెడ్డి  కోరారు. రాష్ర్టంలో అనేక ప్రాజెక్టులు కేంద్రం నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.

ఈ మేరకు శనివారం ప్రధాని మోదీతో ఢిల్లీలో సీఎం భేటీఅయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి అనేక అంశాలు తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, హైదరాబాద్- బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, సెమీ కండక్టర్ పరిశ్రమలకు ప్రోత్సాహం, ఐఎస్‌ఎం ప్రాజెక్టు, రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు, ఎంఎస్‌ఎంఈలకు సహకారం అందించాలని కోరారు. సమాఖ్య స్ఫూర్తి మేరకు రాష్ట్రానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

రీజినల్ రింగ్ రోడ్

హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో రీజినల్ రింగు రోడ్డును (ఆర్‌ఆర్ ఆర్) తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉత్తర భాగం.. సంగారెడ్డి తూప్రాన్  గజ్వేల్ భువనగిరి ల్ (ఎన్‌హెచ్ ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం..చౌటుప్పల్ (ఎన్‌హెచ్ అని పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం భూసేకరణ 2022లో ప్రారంభమైందని..ఇందులో రాష్ర్టం 50 శాతం వ్యయం భరిస్తోందన్నారు. 90శాతం భూముల ప్రపోజల్స్ ఎన్‌హెచ్‌ఏఐకి పంపామన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచిందని..ఈ భాగానికి అవసరమైన ఆర్థిక అనుమతులు, క్యాబినెట్ ఆమోదం ఇవ్వాలన్నారు.

ఉత్తర భాగంతో దక్షిణ భాగం పనులు ఏకకాలంలో చేపట్టాలని కోరారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వృద్ధితో హైదరా బాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని..ఇప్పుడున్న ఓఆర్‌ఆర్ రాబోయే 5 సంవత్సరాల అవసరాలకు సరిపోద న్నారు. ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూసేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది.

అందువలన రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తేనే సరైన ఉపయోగం ఉంటుందన్నారు. దక్షిణ భాగం భూసేకర ణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  

రింగ్ రైల్వే ప్రాజెక్ట్..

రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించా మని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుం దన్నారు. హైదరాబాద్- పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే బందరు పోర్టు నుంచి హైదరా బాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూ రు చేయాలన్నారు.

తెలంగాణ దేశంలోనే 35 శాతం ఔషధాలు ఉత్పత్తి చేస్తోందని, బం దరుపోర్ట్ డ్రైపోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే సరకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందన్నారు. ఈ మా ర్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉం డడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. 

సెమీకండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వండి..

ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోం ద ని.. హైదరాబాద్‌లో ఏఎండీ, క్వాల్‌కామ్, ఎన్వీడియా వంటి ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థల రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. పరిశ్రమలకు స్థలాలు, నైపు ణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఐఎస్‌ఎం ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలపాలన్నారు. 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుందన్నారు. 

రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకారం అందించాలి..

హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని డీఆర్డీవో, డిఫె న్స్ పీఎస్‌యూలు ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నాయ న్నారు.

వాటి పరిధిలో 1,000కి పైగా ఎంఎస్‌ఎంఈలు,  స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడిభాగాలు తయా రు చేస్తున్నాయన్నారు. లాకీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సఫ్రాన్, హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపుతున్నాయన్నారు. రక్షణ రంగంలోని జాయింట్ వెంచర్, ఆఫ్ సెట్లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరమన్నారు. ఆమోదం తెలిపేందుకు ప్రత్యే కమైన వ్యవస్థ ఉండాలని కోరారు. 

హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్..

యూపీ, తమిళనాడు, ఏపీకి ప్రోత్సాహం ఉంది కానీ హైదరాబాద్‌కి లేదని అందుకే ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాల ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో నిర్వహించాల న్నారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు, పీఎల్‌ఐ లాంటి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.