2 May, 2026 | 7:09 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మహిళా ప్రజా ప్రతినిధులు ముందుండాలి

07-03-2026 06:28 PM

కడెం,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ అభివృద్ధిలో మహిళా ప్రజాప్రతినిధులు ముందుండాలని ఎంపీడీవో సునీత అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసర్పంచ్ లకు మరియు వార్డు సభ్యులకు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.

గ్రామపంచాయతీలో పాలన వ్యవహారాలు గ్రామపంచాయతీ చట్టంపై ఐదు రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహించామని ఇందులో నేర్చుకున్న విషయాలన్నీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ముందుండి మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఓటిస్ లు గిరిధర్,నరేంద్ర, గోవర్ధన్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, మమత, తదితరులు ఉన్నారు.