25-05-2025 12:49:28 AM
16న నామినేషన్ల దాఖలు.. l27న ఎన్నికలు
భీమదేవరపల్లి, మే 24 (విజయ క్రాంతి): ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గంలో ఐదుగురు సభ్యుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి, హనుమకొండ డిప్యూటీ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కే కోదండరాములు శుక్రవారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో డిప్యూటీ ఎన్నికల అధికారి ఎం రాంరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కే రవీంద్ర సైతం సహకారం అందిస్తున్నారు.
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలు తేదీ జూన్ 16, నామినేషన్ పత్రాల పరిశీలన జూన్ 17, అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రచురణ జూన్ 17, నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ జూన్ 18, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ప్రకటన జూన్ 18, ఎన్నికల పోలింగ్ జూన్ 27, ఓట్ల లెక్కింపు జూన్ 27, ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జూన్ 30 అని వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందు కు సభ్యులు, అభ్యర్థులు సహకరించాలని ఎన్నికల అధికారి కోరారు.