calender_icon.png 25 May, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్‌హెచ్ పరిశోధక విద్యార్థికి డాక్టరేట్

25-05-2025 12:46:17 AM

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం అజీజ్‌నగర్ క్యాంపస్‌కు చెందిన పరిశోధక విద్యార్థి వీ సాయి బాబు డాక్టరేట్‌కు అర్హత సాధించారు. శనివారం కేఎల్‌హెచ్ ఈసీఈ రీసెర్చ్ విభాగాధిపతి ప్రొఫెసర్ బీ అనిల్ కుమార్ విడుదల చేసిన ఒక ప్రకటనలో డాక్టరేట్ సాధించిన పరిశోధక విదార్థికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

కేఎల్‌హెచ్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫె సర్ ఆకెళ్ల రామకృష్ణ మార్గదర్శనంలో.. నిద్ర సంబంధిత రుగ్మతులను సైకో అకౌస్టిక్స్ ఆధారంగా గుర్తించి, విశ్లేషించే ప్రక్రియ గురించి పరిశోధనలు చేసి, సిద్ధాంత వ్యాసాలు సమర్పించినట్టు ఆయన తెలిపారు.

వీ సాయిబాబు సమర్పించిన సిద్ధాంత వ్యాసాలు పీహెచ్‌డీ పట్టా పొందటానికి అర్హత సాధించడం పట్ల కేఎల్ విశ్వవిద్యాలయం వీసీ, డీన్ ఆర్‌అండ్‌డీ ప్రొఫెసర్ బీటీ పీ మాధవ్, కేఎల్‌హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆకెళ్ల రామకృష్ణ, ఈసీఈ విభాగధిపతి ప్రొఫెసర్ గౌతమ్, వివిధ ఇంజినీరింగ్ విభాగాధిపతులు, అధ్యాపకులు సాయిబాబును అభినందించారు.