7 March, 2026 | 8:08 PM

విశ్వకర్మ పథకం సద్వినియోగం చేసుకోండి

07-03-2026 06:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు శనివారం పట్టణంలోని హోటల్ మారుతి ఇన్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ... ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాల పథకాలు అన్నిటిని అర్హులైన వారు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఉన్నతికి ఎన్నో రకాలైన పథకాలను అమరుపరుస్తున్నాయని అన్నారు. పేద ప్రజలు,  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో ఎదిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని చెప్పారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందడమే కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించేలా ఎదుగుతారని తెలిపారు.

ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించి అవసరమైన మెలుకువలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇండియన్ పోస్ట్స్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్ పెక్టర్ రాజేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.