30 July, 2026 | 9:05 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

నన్ను ఎగతాళి చేశారు

18-02-2025 12:00 AM

‘కొత్త బంగారు లోకం’తో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది శ్వేత బసు ప్రసాద్. ప్రస్తుతం హిందీలో సినిమాలు, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేత తన కెరీర్ గురించి మాట్లాడింది. ఓ తెలుగు సినిమా సెట్‌లో తాను అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్‌లో హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని నన్ను ఎగతాళి చేసేవారు. హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5 అడుగులు ఉందని అనేవారు. ఆ హీరో రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. నాకూ తెలుగు సరిగ్గా రాదు. కానీ, డైలాగ్స్ నేర్చుకొని నెట్టుకొచ్చేదాన్ని.

అతను మాత్రం అలా కాదు.. మాతృభాష తెలుగే అయినా అతనికి భాషపై కంట్రోల్ లేదు కానీ, నన్ను మాత్రం నా కంట్రోలో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా! దానికి నేనేం చేసేది.

నాకు తెలిసి నేను అంత్యంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే ఆ సినిమాదే’ అని చెప్పింది శ్వేతాబసు ప్రసాద్. తాజాగా శ్వేతాబసు నటించిన ‘ఊప్స్ అబ్ క్యా?’ అనే సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.