16 May, 2026 | 2:10 AM

శివకార్తికేయన్ మదరాసీ

18-02-2025 12:00 AM

స్టార్ హీరో శివకార్తికేయన్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషనల్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమే ‘మదరాసీ’. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి సోమవారం టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.  శివకార్తికేయన్ పుట్టినరోజును పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌లో శివకార్తికేయన్ పూర్తిగా పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు.

సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడా ఇందులో పరిచయం చేశారు. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రంతో సరికొత్త కథను చూపించబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.  మొత్తంగా టైటిల్ రివీల్, గ్లింప్స్ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేశాయి. ఇందులో కథానాయకిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది.

హీరోయిన్‌గా ఆమెకు ఇది మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాగా.. ఇందులో ఇంకా విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుదీప్ ఎలామోన్; సంగీతం: అనిరుధ్ రవిచందర్; ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్.