9 August, 2026 | 2:50 AM

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

09-08-2026 12:00 AM
  1. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
  2. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి 
  3. రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య 

ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య, నాయకులు బక్క జడ్సన్, ఐఎన్ టి యుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న, పృద్వి లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కేవలం ఉద్యోగుల సమస్యలు మాత్రమే కావని ఇవి సామాజిక న్యాయం కార్మిక హక్కులు గౌరవపదమైన ఉపాధి సంబంధించిన విషయం అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇకపై ఆలస్యం చేయకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.

విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు పూర్తిస్థాయి రక్షణ ప్రసూతి హక్కుల అమలు చేయాలన్నారు. అన్ని శాఖల్లో ఒకే విధమైన ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధన వరకు ఉద్యమం ఆగదని ఐక్యంగా బలాన్ని చాటుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు దోలుపడి శ్రీధర్, దుర్గం శ్రీనివాస్, కోశాధికారి కోటల సంతోష్, శేఖర్ రెడ్డి, సురేందర్ గౌడ్, రాజు మహమ్మద్, జ్యోతి, పద్మ, విజయలక్ష్మి, రవి కిరణ్, క్రాంతి ,అజయ్, లింగయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.