9 August, 2026 | 1:34 AM

ఇది పేదల ప్రభుత్వం.. గరీబోళ్లు మెచ్చిన ప్రభుత్వం

09-08-2026 12:00 AM
  1. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్           
  2. శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

జవహర్ నగర్, ఆగస్టు 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని తెలంగాణలో ముఖ్యంగా గరీబోళ్లు మెచ్చిన ప్రభుత్వమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తెలిపారు. శనివారం చంద్రపురికాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వ ర్యంలో మాజీ ఎంపీటీసీ మొగిలిపాక పరశురాం, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు నర్ర మహేష్, రాహుల్ కథమ్, బబ్లూ ముదిరాజ్ అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ లో 210 కోట్లతో ఇంటిగ్రేటేడ్ పాఠశాల, సుమారు 50 కోట్లతో తెలం గాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంబం కానున్నాయన్నారు. జవహర్నగర్, చంద్రపురికాలనీని అన్ని రంగాల్లో అభి వృద్ధి పరచడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. మరో రూ.5 కోట్లతో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 100 ఫీట్ల ప్రధాన రహదారి పనులు జరుగుతున్నాయని త్వరలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రతీ కాలనీలో మట్టిరోడ్డు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో జవహర్నగర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతికోటేష్, మాజీ డిప్యూటీ మే యర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సదానంద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి అనంతలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ఈగ స్వేతరాజు ముదిరాజ్, మాజీ కార్పోరేటర్లు వేణు, కుతాడి శ్రీకాంత్, సాయికుమార్, నాయకులు బల్లి శ్రీనివాస్, వినయ్, మిట్టూ యాదవ్, రజితగోపాల్, బూడిద వెంకటేష్, కారింగుల రాజుగౌడ్, చిట్టిబాబు, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.