21 April, 2026 | 4:06 AM

పేరు మార్చుకుంటా..

21-04-2026 02:41 AM

బాగుచేసిందే మేం!.. 

కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా: సీఎం రేవంత్

* జీవన్‌రెడ్డి వెనుక ఉన్న మచ్చలన్నీ నాకు తెలుసు. మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావు వెంట వెళ్లారు. 14 సార్లు కాంగ్రెస్ బీఫాం ఇస్తే మోసం చేసి, ఇప్పుడు గులాబీ గూటికి చేరారు. దళిత బిడ్డను మంత్రిని చేసినందుకు జగిత్యాలలో పార్టీ ఓడిపా వాల్నా. బలహీనవర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్‌ను మంత్రిని  చేసిన ందుకు, ఆది శ్రీనివాస్‌ను విప్ చే సిందుకు ప్రజా పాలన పోవా ల్నా.. శ్రీధర్‌బాబు నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పోవాల్నా?

 రేవంత్‌రెడ్డి

  1. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం.. 
  2. ఎవ్వరు అడ్డం వచ్చినా తొక్కుకుంట పోవుడే 
  3. రాష్ట్రం నుంచి 15 మందిని ఎంపీలుగా గెలిపిస్తా.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తా 
  4. ఫాంహౌస్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు అధికారంలోకి రావాలో ఆ పెద్దమనిషే చెప్పాలి 
  5. భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి రైతు ఉత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి  
  6. పారదర్శక పాలన అందిస్తున్నాం: మంత్రి  శ్రీధర్‌బాబు

నస్తూరుపల్లి (మహబూబాబాద్), ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టాం.. సర్పంచ్ ఎన్నిక ల్లో పాతరేసినం.. మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసినం. జూబ్లీహిల్స్, కంటోన్మెం ట్ ఉప ఎన్నికల్లోనూ ఘోరీ కట్టాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వం. లేదంటే.. నా పేరు మార్చుకుంటా కేసీఆర్! ఇదే నా సవా ల్. నువ్వో.. నేనో ! వచ్చే ఎన్నికల్లో తేల్చు కుందాం.

ఎవరు అడ్డంవచ్చినా ఇక తొక్కు కుంట పోవుడే’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర మైన స్వరంతో సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ౧౫సీట్లు గెలిపిం చుకుని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. అ ప్పులతో అస్తవ్యస్తమైన తెలంగాణను ప్రజా పాలన ప్రభుత్వం బాగుచేసామని చెప్పరు.

ప్రజాపాలనలో రైతుఉత్సవాల పేరిట సోమ వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండ లం నస్తూరుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. తొలుత సీఎం సభావేదిక ద్వారా రైతుల ఖాతాల్లో రెండో దఫా రైతుభరోసా నిధులు రూ. 5,653 కోట్లు విడుదల చేశారు.

 జీవన్‌రెడ్డిది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర

‘ప్రజాపాలన పోవాలి.. పాపాలభైరవుడు రావాలని ఓ పెద్దమనిషి అంటున్నారని, ఫాంహౌస్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు అధికారంలోకి రావాలో ఆ పెద్దమనిషే చెప్పాలని జీవన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు జెండా మోస్తేనే రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. జీవన్‌రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ తనకు తెలుసునని, మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్‌రావు వెంట వెళ్లారన్నారని గుర్తుచేశారు.

40 ఏళ్ల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్ బీఫాం ఇస్తే మోసం చేసి, ఇప్పుడు గులాబీ గూటికి చేరారని మండిపడ్డారు. ‘70వేల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ప్రజాప్రభుత్వం పోవాలా?’ అంటూ ప్రశ్నించారు. ‘దళిత బిడ్డను ఎమ్మెల్యేను కాకుండా మంత్రిని చేసినందుకు జగి త్యాలలో పార్టీ ఓడిపావాల్నా. బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్‌ను మంత్రి చేసినందుకు, ఆది శ్రీనివాస్‌ను విప్ చేసిందుకు ప్రజాపాలన పోవాల్నా.. శ్రీధర్‌బాబు నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పోవాల్నా అంటూ సీఎం ప్రశ్నించారు.

‘ఇంత అసూ య, ఇంత ద్వేషం కడుపులో ఎవరికైనా ఉంటుందా? ఇంతకాలం ముసుగు తొడుక్కొని జీవన్‌రెడ్డి బతికారని, ఇన్నాళ్లకు ఆ ముసుగు తొలగిపోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్, జీవన్‌రెడ్డి కడుపునిండా విషమేనని, ఇప్పుడు వారిద్దరూ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నరని విమర్శించారు. వరి వేస్తే ఉరే అని చెప్పి.. పంటకొనేది లేదన్న నేత పాలన మళ్లీ రావాల్నా? వాస్తు బాగా లేదని బాగున్న సచివాలయం కూల్చి కొత్తగా కట్టుకున్నవారి పాలన కావాలా.. అంటూ ప్రశ్నించారు.

నాటి పాలనలో తండ్రి, బిడ్డ, కొడుకు.. ఇలా తలో ఫాంహౌస్ కట్టుకున్నారని, ఏనాడూ పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన చేయలేదని మండిపడ్డారు. నేరెళ్లలో ఎస్సీలను ఇసుక లారీలతో తొక్కించినందుకు పాపాల భైరవుడు మళ్లీ రావాల్నా.. ఖమ్మంలో గిరిజన రైతుల చేతులకు బేడీలు వేసినందుకు పాపాల భైరవుడు రాలేదని మండిపడ్డారు.

వ్యవసాయం పండుగ

రెండో దఫా రైతుభరోసా ద్వారా  దాదా పు 45 లక్షల మంది రైతులకు ఆర్థికభరోసా లభిస్తుందని వెల్లడించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి ౨౪ గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నదని వెల్లడించారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.

రైతుభరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థికపరమైన భరోసా అందిస్తున్నామని వివరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని తెలిపారు. రైతులను రాజులాగా మార్చేందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతు భరోసా నిధులు విడుతలవారీగా అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం దివాలా తీసిందని, వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు మాత్రం రైతు భరోసా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

రాష్ట్ర క్యాబినెట్ ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేసి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగునీరు అందించేందుకు చర్య లు తీసుకుంటున్నదని వివరించారు. దీనిలో భాగంగానే తాము కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ మరమ్మతులకు పూనుకొన్నదని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతమేర అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు.

తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం.. రెండూ జోడెడ్లలా కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో వందకు వందశాతం రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పథకం ద్వారా 25.35 లక్షల మందికి రుణవిముక్తి కల్పించామని, పథకానికి ఏకంగా రూ.22 వేల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.

వచ్చే నెలలో మూడో విడత రైతుభరోసా కూడా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని గుర్తుచేశారు.

చెట్టుకు ఉరేసినా తప్పులేదు

కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లను గోదావరిలో పోసి వృథా చేశారని, అం దుకు చెట్టుకు ఉరేసినా తప్పులేదని సీఎం తీవ్రమైన సర్వంలో ప్రసంగించారు.పేదలు, దొరల గడీల ముందు ఊడిగం చేస్తూ అలాగే ఉండాలని భావించారని పేర్కొన్నారు. పేదలు కట్టుకునేందుకు పనికిరాని బతుకమ్మ చీరె లు పంచారని, వేములవాడకు రూ. 100కోట్లు ఇస్తానని ప్రకటించి పదేళ్లలోఉ రూపాయి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఒక సంప్రదాయం ఉం దని 1994, -2004 వరకు రెండుసార్లు టీడీపీ, 2004, -2014 వరకు వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పాలన సాగిందని గుర్తుచేశారు.

అలాగే, 2014 నుం చి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉందన్నారు. అదే రీతిలో 2023 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉం టుందని జోస్యం చెప్పారు. నాడు వైఎస్సార్, డీఎస్ కలిసి, ఎలానైతే కాంగ్రె స్‌లో అధికారంలోకి తెచ్చారో.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చరిత్ర పున రావృతం చేస్తామని, తద్వారా కొత్త చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖిస్తామని వెల్లడించారు.

పారదర్శక పాలన అందిస్తున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు

ప్రజల కోసం తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.

రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని వివరించారు. ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్రతి సమస్యకూ తమ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.