పల్స్ పోలియో 98 శాతం నమోదు
ములకలపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో మొదటి రోజైనా ఆదివారం విజయవంతమైంది. ములకలపల్లి మండల హెడ్ క్వార్టర్ లోని బస్టాండ్ పోలియో బూతులో స్థానిక సర్పంచ్ చంద్రలేఖ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములకలపల్లి మండలంలోని 20 పంచాయితీల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగింది.
జగన్నాధపురం లో సర్పంచ్ కుంజా వినోద్, తిమ్మంపేట లో సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు, సీతారాంపురంలో సర్పంచ్ కుంజా రవి తోపాటు అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచులు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు చుక్కలు వేశారు.
మండలంలో 35 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుచేయగా అన్నింటిలో కలిపి 2385 మంది పిల్లలు ఉండగా వారిలో 2348 మంది పిల్లలకు పోలియోచుక్కలు వేయడం జరిగింది.98% పిల్లలకు ఈ రోజున పోలియో చుక్కలు అందాయి.మిగిలిపోయిన 2% మంది పిల్లలకు రేపు,ఎల్లుండి నిర్వహించబోవు ఇంటింటి సర్వే కార్యక్రమంలో పోలియో చుక్కలు అందించనున్నారు.మండలంలో మొత్తం 13 గుత్తి కోయ హై రిస్క్ గ్రామాలు ఉండగా ఈరోజు 8 ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు. మిగిలిన ప్రాంతాలను సోమ, మంగళవారాల్లో పూర్తి చేయనున్నట్లు స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి సాయి కళ్యాణ్ తెలిపారు.






