1 August, 2026 | 2:58 AM

కన్నాల ఆలయ అర్చకులకు ప్రతి నెల వేతనం నేనే అందజేస్తా

24-08-2024 05:18 PM

మంథని మున్సిపల్ చైర్ పర్సన్  పెండ్రి రమా సురేష్ రెడ్డి

మంథని, (విజయక్రాంతి: మంథని మండలంలోని కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆలయ అర్చకులకు ప్రతి నెల వేతనం నేనే అందజేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి తెలిపారు. శనివారం కన్నాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ అర్చకులకు ఖర్చుల నిమిత్తం రూ. 9వేల రూపాయలు చైర్ పర్సన్ అందజేశారు.

అనంతరం ఆమె మాట్లుడుతు మా కుటుంబ సభ్యులైన మస్కుల నారాయణ రెడ్డి  కుమారుడు శ్రావణ్ రెడ్డి, సహకారముతో  ప్రతి నెల  అర్చకులకు వేతన సహాయం అందిస్తామన్నారు. అనంతరం  మున్సిపల్ పాలకవర్గ కుటుంబ సభ్యుల తో కలిసి పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ శ్రీపతి బాణయ్య, గుండా విజయలక్ష్మి పాపారావు, కుర్ర లింగయ్య, కొట్టె పద్మ రమేష్, వి.కె రవి, వేముల లక్ష్మి సమ్మయ్య, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.