1 August, 2026 | 1:55 AM

రుణ మాఫి చేయడంలో ప్రభుత్వం విఫలం....

24-08-2024 05:18 PM

నిజమైన రైతులకు రుణ మాఫి అయింది లేదు 

అవగహన లేని మున్సిపాలిటీ కమిషనర్ వల్ల ప్రజలకు తప్పని ఇబ్బందులు....

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మున్నూర్ రవీందర్ 

వనపర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వం రాష్ట్రములో అధికారంలోకీ రాకముందు రెండు లక్షలు రుణ మాఫి చేస్తామని చెప్పి తిరిగి ప్రభుత్వం లోకి వచ్చిన తరువాత ఎంత మంది రైతులకు రుణ మాఫి అయిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని రుణ మాఫి చేయడం లో ప్రభుత్వం విఫలం అయిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మున్నూర్ రవీందర్ అన్నారు.  శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మి కృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం రెండు లక్షలు రుణాలు మాఫి చేస్తున్నాము పెద్ద ఎత్తున సంబురాలు చేయాలని ఢిల్లీ వెళ్లి పెద్దలను పిలిపించి పండుగల చేయాలని అన్నారు. కానీ రుణ మాఫి చేయడంలో విఫలం అవుతున్నారన్నారు.  లక్ష, లక్షన్నర, రెండు లక్షలు అప్పులు ఉన్నవారు ఎంత మంది ఉన్నారు. ఎవరి ఖాతాలలో జమ చేశారు ఎంత పర్సెంటెజీ లేదని ఆయన వివరించారు. వ్యవసాయం రుణాలు అంటే పెట్టుబడి కోసం తీసుకున్నారా లేకపోతే మాడిగేజ్ చేసిన రుణలు ఉన్నాయి.

మరి ఏ రకంగా ఉన్న రుణలు మాఫి చేస్తున్నారో ప్రభుత్వం కు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.  ఇన్ కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్లకు అయింది నిజమైన రైతులకు రుణ మాఫి కాకా రోడ్డు పై నిల్చున్ని ధర్నా చేస్తున్నారని ఆయన విమర్శించారు. రూ 33 వేల కోట్ల రుణాలు ఉన్నాయని ముఖ్య మంత్రి కాకముందు చెబితే అయిన తరువాత 18 వేల కోట్ల ను రైతులు రుణ మాఫి చేసాను అని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.  ధరణి మీద ప్రభుత్వం కు అవగహన లేదని అందులో ఉన్న లోటు పట్లను గుర్తించ లేదన్నారు. వనపర్తి లో కరెంట్, తాగునీరు లేవు రోడ్ల వెడల్పు కూడా లేదు. వర్షం కాలంలో కూడా వారం రోజులు అయిన కూడా నీళ్లు ఇవ్వలేదు కమిషనర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వనపర్తి మున్సిపాలిటీ కీ అనర్హత కలిగిన కమిషనర్ రావడం వల్లనే ఇబ్బందులు ప్రజలు పడుతున్నారన్నారు.  ఎమ్మెల్యే మేఘా రెడ్డి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి లు మేమేoతా సమర్థులు అంటారు. కదా ఎందుకు వారం రోజుల నుండి ప్రజలకు తాగునీరు ఇవ్వడం లో విఫలం అవుతున్నారు.  నేడు వనపర్తి జిల్లా బిజెపి పార్టీ సభ్యత్వం ప్రారంభించడం కోసం రాణి రుద్రమదేవి వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దాని కంటే రెండితలు చేయడానికి వస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో కన్వీనర్ ప్రవీణ్, మీడియా సెల్ కన్వీనర్ పెద్ది రాజు లు పాల్గొన్నారు.