విచారణకు పిలిస్తే వెళ్తా
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింద ని అందుకే ఆయన్ని విచారణకు పిలిచా ర న్నారు.
కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్‌ను వి చారణకు పిలవటమే నేరమని అన్నట్టు మా ట్లాడుతున్నారని తెలిపారు. విచారణకు ఎవరినీ పిలిచినా సరే వెళ్లాల్సిందే.. చ ట్టాలకు ఎవరు అతీతం కాదన్నారు. తాను తప్పు చేయకపోయినా సరే ఈడీ, సీబీఐ వి చారణకు వెళ్లానని గుర్తు చేశారు. ఫోన్ ట్యా పింగ్ కేసు సాగదీయకుండా విచారణను తుది దశకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.






